రాజాసాబ్ మూవీ ని మారుతి గారు డైరెక్ట్ చేసారు.ఎన్నో అంచనాల మద్య మూవీ రిలీజ్ అయింది.కానీ ఆ అంచనాలను మూవీ అందుకోలేక పోయింది.దానికి గల ప్రధాన కారణం కధనం బాగాలేదు.కథ విషయానికి వస్తేయ్ హీరో ప్రభాస్ గారు తన నాన్నమ్మ తో కలిసి బ్రతుకుతుంటాడు.ఆవిడ తప్పిపోయిన వాళ్ళ తాత గురించి హీరో కి చెప్తూ బాధపడ్తుంటుంది అప్పుడు హీరో కి వాళ్ళ తాతయ్య గురించి క్లూ దొరుకుతుంది సిటీ కి బయలుదేరుతాడు.
హీరో సిటీ కి వెళ్ళాక వాళ్ళ తాతయ్య మంచి వాడు కాదు అతనొక తాంత్రికుడు అని తెలుస్తుంది.హీరో వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మ ని బలి ఇచ్చి పవర్స్ పొంది మళ్లీ పుట్టి తాను దోచుకున్న సంపదని అనుభవించాలి అనుకుంటాడు.హీరో దాన్ని ఎలా అడ్డుకున్నాడు అనేది కథ.
సినిమా లో అసలు మారుతీ మార్క్ కామెడీ లేనే లేదు.మారుతీ గారి సినిమా లో మాక్స్ కామెడీ సూపర్ గ వుంటాది కానీ ఈ మూవీ లో అంత గ కామెడీ వర్కౌట్ కాలేదు.
కాని ఒక సీన్ దగ్గర హీరో వాళ్ళ తాతయ్య ఒక దెయ్యం బంగ్లా లో దాచి ఉంచిన మనీ మొత్తాన్ని కాల్చేద్దాం అని అనుకుంటాడు కోపం లో బంగ్లా లోపలి వెళ్లి నిప్పు పెట్టేస్తాడు అక్కడ ఉన్న సంపాదకీ కానీ తాంత్రికుడు అయిన తాతయ్య కాలుస్తుంది సంపాదన లేక వాళ్ళ నాన్నమ్మ అని తికమక పెట్టెయ్ సీన్ బావుంటుంది.వాళ్ళ తాతయ్య బ్యాక్ స్టోరీ బావుంటుంది.
ఈ కథ లో ముగ్గురు హీరోయిన్ లు అనవసరం ఏమో అనిపించింది.
ఎక్కడా కూడా కధనం థ్రిల్లింగ్ గా గని ఇంట్రస్టింగ్ గా కానీ అనిపించలేదు .ఈ మూవీ లో కామెడీ ట్రాక్ అంత గ వర్కౌట్ అవ్వలేదు .
మొత్తానికి సినిమా కథ బాగానే వున్నా కథనం లో లోపం కారణంగా కొంత ఇబ్బంది గ ఉంటుంది అనే చెప్పుకోవాలి .
కానీ చివర్లో వచ్చే జోకర్ గా చేతిలో సుత్తి పట్టుకున్నది బావుంది .నిజంగా ప్రభాస్ గారిని జోకర్ క్యారెక్టర్ లో చూపించి ఉంటె చాల బావుండేది అనుకుంటున్నా.
