ఏవో కలలు,ఆశలు సాదించాలనుకున్న యేమి సాదించలేక ఒక ప్రైవేట్ కంపెనీ లో చిన్న ఉద్యోగం వెలగపెడుతున్న మూడు పదుల బ్రహ్మచారిగా ఒక సాదారణ మద్య తరగతికి చెందిన నేటి తరం యువకుడ్ని.నేను కలలు సాదించలేక పోయిన, నాకు వచ్చిన కలల్లో సాదించాలి అనుకుంటున్న ఇప్పటి యువకుల కలల రాకుమారి లాంటి అమ్మాయి,కళ్ల నుండి కాళ్ళ వరకు అందాల్ని నింపుకున్న నా ప్రియురాలు "కళ". కల లో తప్ప కళ్ళతో చూడడానికి దైర్యం లేని వాడిని సింపుల్ గా చెప్పాలంటే ఐఫోన్ లో ఘంటసాల గారి పాటలు వినే వాడి లా అంటే బ్లాక్&వైట్ సినిమాల్ని నెట్‌ఫ్లిక్స్ లో చూసినట్టు మనిషిని అయితే ఈ తరం వాడ్ని నా ఆలోచనలు కాదు. నా కల లో వచ్చే అందమైన కళ ఎప్పుడు నా కళ అవుతుందో అని ఆరాటపడే వాడ్ని. ఆ రోజు దసరా మా గ్రామం లో డాన్స్ షో పెట్టారు. ఆ షో కి మా గ్రామం లో వున్న చిన్న,పెద్ద అందరూ వచ్చారు. నా కళ కూడా ముందు వరుసలో కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. నేను వెనుక గా నా ఫ్రెండ్ పక్కన నిలబడి టివి లో మూవీ మద్య లో వచ్చే ప్రకటనల లాగా తనని చూస్తున్న. ఇదంతా గమనిస్తున్న నా ఫ్రెండ్ ఏంటి సంగతి అని అడిగాడు. నా మనసులో మాట వాడికి చెప్పా, ఇంతలో కళ నా వైపుగా మూవీస్ లో హీరోయిన్ ల స్లో-మోషన్ లో నా గుండె చప్పుడు అనే బ్యాక్-గ్రౌండ్ మ్యూజిక్ లో వస్తుంది. అలా తను నా ముందుకు రాగానే ఒక నిండు చందమామని టెలిస్కోప్ లేకుండా దగ్గరగా చూసినట్టు అనిపించింది. ఇంతలో మా ముందు వరసలో కూర్చున్న వాళ్ళ నాన్న దగ్గరకి వచ్చి మొబైల్ తీసుకుంది డాన్స్ వీడియొ లు తీస్తాను అని చెప్పి అలా తను తిరిగి వెళ్లిపోతూ నా వైపు చైనా వాళ్ళు చిన్న కళ్ళతో చూసినట్టు వొరగా చూసింది. ఆ చూపులు ఆఫ్గానిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకొన్నట్టు నా మనసుని తుపాకులు లేకుండా ఆక్రమించుకుంది. తను నా వైపు ఎందుకు చూసిందో క్వాంటం-ఫిజిక్స్ థియరీస్ లాగా నా మైండ్ అంతా గజిబిజిగా నిద్ర కూడా రాలేధు. ఆ తరువాత రోజు తను నన్ను ఎందుకు చూసిందో అడుగుదాం అని మనసులో గట్టిగా అనుకోని తను కాలేజీ కి వెళ్లడానికి యెక్కే బస్ దగ్గరకి వెళ్ళాను. తను ఆ బస్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంది నా వైపు చూస్తుంది అని అనుకున్న కానీ చూడలేదు. ఆ తరువాత కళ నన్ను కామన్ గా చూసి వుండొచ్చు. అయిన మనికి ఈ ప్రేమలు,దోమలు అవసరమా అని ఒక వారం రోజులు నా పనుల్లో నేను వున్న కానీ నా మనసు మాత్రం ఎన్నికలు అప్పుడు రాజకీయ నాయకుడు వోటర్స్ ని ప్రలోబపెట్టినట్టు తననిచూడాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అనుకున్న వెంటనే ఊరంతా చికెన్ వాసనలు ముక్కు ని దండయాత్ర చేస్తున్న రోజు(ఆదివారం) తన ని ఇంటి దగ్గర చూసాను.తను మేడ మీద ఇంద్రదనస్సు లాంటి తన కలర్ డ్రస్ లని దండే మీద ఆరేస్తుంది. ఇదంతా చూస్తూ తన ఇంటి ముందు వున్న టీ షాప్ దగ్గర టీ తాగుతూ వుండగా నా గొంతు తనని పేరుపెట్టి పిలవమని అన్నట్టుగా నా గొంతు దగ్గుతో పిలిచింది అనుకోకుండా ఆ దగ్గు వల్ల వర్షం లో ఇంద్రదనస్సు కనుమరుగయ్యే లా ఒక నెమలి కళ్ళు పురి విప్పినట్టు తన రెండు అందమైన గాజు కళ్ళతో నా వైపు తదేకంగా చూసింది.రద్దీగా వుండే దేవాలయం లో దేవతని తనివి తీర చూసి దండం పెట్టుకోవాలి అనుకుంటున్న లోపే అక్కడ వున్న సెక్యూరిటి మనల్ని పక్కకి తోసేసినట్టు వాళ్ళ నాన్న అప్పుడే బయటకి వచ్చాడు.ఆ రోజు నుండి ఆ అమ్మాయి ని సెలిబ్రిటీ ని సోషల్ మీడియా లో ఫాలో అయినట్టు అయ్యాను. కానీ మా నాన్న కి వొంట్లో బాగోక పోవడం తో సిటి లో వున్న హాస్పిటల్ లో చేర్చాము. అక్కడ సుమారు ఒక నెల రోజులు వుండాల్సి వచ్చింది. పిల్లోడు స్కూల్ విడిచిపెట్టినాక కొట్టే బెల్ విన్నప్పుడు సంతోషంగా ఇంటికి పరిగెత్తే వాడిలాగా నేను కూడా కళ ఇంటి వైపు మనసు తో పరిగెడుతూ వెళ్ళాను. వాల్ల ఇంటి ముందు ఒక ఫ్లెక్సి దానిలో ఒక అబ్బాయి ఫోటో పక్కన వెడ్స్ అనే అక్షరాలతో పాటుగా తన ఫోటో చూసి మబ్బులు వర్షం పడే ముందు నీటిని దాచినట్టు నా కళ్ళు కన్నిటిని దాచాయి. అప్పటి నుండి కళ కలలో కాకుండా నా కన్నీటి లో కనిపిస్తుంది.
పేరు: వరుణ్ ఆరినాన